Woman Attacked By Blade 118 Stitches: దేశంలో రోజురోజుకూ మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎంతమందిని అరెస్ట్ చేసినా.. కొందరి ఆకతాయిల్లో మార్పు రావడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ మహిళతో కొందరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా ఆమె ముఖంపై బ్లేడుతో దారుణంగా దాడికి పాల్పడ్డారు. డాక్టర్లు ఆమెకు చికిత్స అందించి 118 కుట్లు వేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది.. భోపాల్‌కు చెందిన ఓ మహిళ తన భర్తతో బైక్‌పై మార్కెట్‌కు వెళ్లింది. అయితే మార్గమధ్యలో వాటర్ బాటిల్ కొనేందుకు భార్యాభర్తలిద్దరూ స్థానికంగా ఉన్న ఓ దుకాణానికి వెళ్లారు. ఆ సమయంలో కొందరు యువకులు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఏవో కామెంట్స్ చేస్తూ ఈలలు వేశారు. దీంతో ఆమె వారిని ఎదిరించి చెప్పుతో కొట్టింది. ఒక్కసారిగా దుకాణంలో ఉన్నవారంతా గుమిగూడారు. ఆకతాయిలను చెదరగొట్టారు. ఆమె ఎదురు తిరిగిందనే కోపంతో కాసేపటికే మళ్లీ ఆ యువకులు వచ్చి వెనుక నుంచి ఆమె ముఖంపై పలుమార్లు బ్లేడుతో దాడి చేశారు.