తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళ తాకితే స్పృహ కోల్పోతున్న పూజారి.. అదే కారణమా?

మహిళ స్పర్శ తగిలితే చాలు.. మూర్ఛపోతుండాట ఓ పూజారి. హనుమాన్ భక్తుడిని కావడం వల్లే తనకు ఇలా జరుగుతుందని అంటున్నాడు. విసుగు చెందిన కొందరు భక్తులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా నర్సు తాకడం వల్ల అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు!. కానీ ఆ తర్వాతే అసలు విషయం బయటపడింది. అసలేం జరిగిందంటే?

priest disorder
priest disorder

By

Published : Jun 23, 2022, 12:20 PM IST

మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఆలయానికి వచ్చిన మహిళలను తాకితే స్పృహా కోల్పోతానని దూరం పెడుతున్నాడు హనుమాన్ గుడి పూజారి. ఎందుకని అడిగితే.. తాను హనుమాన్​ పరమ భక్తుడిని.. అందుకే ఆడవారిని తాకితే కళ్లు తిరిగి పడిపోతానని చెప్పేవాడు. దీంతో విసుగు చెందిన కొందరు భక్తులు.. స్థానికంగా ఉన్న సైకియాట్రిస్ట్​ దగ్గరకు అతడ్ని తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించాక అక్కడ అసలు విషయం బయటపడింది.

పూజారి

ఆసుపత్రికి వచ్చిన పూజారిని జేపీ ఆసుపత్రి సైకియాట్రిస్ట్​​ డా.ఆర్​.కె.బైరాగి వివిధ రకాల పరీక్షలను నిర్వహించారు. వాటి నివేదికలను పరిశీలించి అన్నీ సరిగ్గానే ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ తర్వాత కాస్త ఆలోచించిన డాక్టర్​.. పూజారికి చిన్న పరీక్ష పెట్టారు. 'మహిళా నర్సు నిన్ను తాకుతుంది. నువ్వు స్పృహా కోల్పోతావో లేదో చూద్దాం' అని డాక్టర్​.. పూజారితో చెప్పాడు. కానీ మహిళా నర్సుతో కాకుండా, ఆఫీస్​ బాయ్​తో తాకించాడు డాక్టర్​. అది తెలియని ఆ పూజారి మాత్రం కళ్లు తిరిగి పడిపోయాడు. పూజారి స్పృహలోకి వచ్చాక డాక్టర్​ జరిగినదంతా చెప్పాడు. దీని తర్వాత వైద్యులు.. చికిత్సను ప్రారంభించారు.

ఆడవారి బదులు మగవారితో టచ్ చేయిస్తున్న దృశ్యం
స్పృహ తప్పి పడిపోయిన పూజారి

"ఇది ఒక రకమైన మానసిక రుగ్మత వ్యాధి. కొందరు తనను తాను అమితాబ్​ బచ్చన్​లా ఊహించుకుంటుూ నటిస్తారు. కొందరు మంచి డ్యాన్సర్​ అనుకుంటూ నృత్యం చేస్తారు. అదే విధంగా, ఈ పూజారి కూడా తనలో భగవంతుడి శక్తి ఉందని భావిస్తున్నాడు. అందుకే ఇలా చేస్తున్నాడు. ప్రస్తుతం పూజారికి చికిత్స అందిస్తున్నాం."

-- డా.ఆర్​.కె. బైరాగి, మానసిక వ్యాధి నిపుణులు

పూజారికి కొద్దిరోజులుగా కౌన్సిలింగ్​ ఇస్తున్నామని చెప్పారు వైద్యులు బైరాగి. దాంతో పాటు వైద్యం అందిస్తున్నామని కూడా తెలిపారు. వీరిని సైకోపత్ ​అని​ అనొచ్చని, ఇలాంటి వారు అనేకమంది ఉన్నారన్నారు. వారికి కూడా వైద్యంతో పాటు కౌన్సిలింగ్​ అందిస్తే సరిపోతుందని డాక్టర్​ బైరాగి చెప్పారు.

ఇవీ చదవండి:'మహా' సంక్షోభం.. శిందేకు పెరుగుతున్న బలం.. అసోంలోనే మకాం!

యువకుడి హత్య.. రాళ్లతో నిందితులను కొట్టి చంపిన గ్రామస్థులు

ABOUT THE AUTHOR

...view details