Bhima koregoan case: భీమా-కోరెగావ్ కేసులో నిందితురాలు, న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్‌కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. సుదా భరద్వాజ్‌కు న్యాయస్థానం డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే.. ఇదే కేసులో వరవరరావు, సుధీర్ ధావలే సహా 8 మంది నిందితుల డీఫాల్ట్ బెయిల్ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.
Sudha bharadwaj bail: ఈ కేసులో నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ ఎస్ఎస్ షిందే, జస్టిస్ ఎన్జే జామాద్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. సుధా భరద్వాజ్ బెయిల్ పొందేందుకు అర్హురాలని తెలిపింది. బైకుల్లా మహిళా కారాగారంలో ఉన్న ఆమెను డిసెంబరు 8న ముంబయిలో ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరచాలని ధర్మాసనం ఆదేశించింది. ఆమె బెయిల్ షరతులు, విడుదల తేదీపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది.