తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వరవరరావును ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశం - విరసం సభ్యుడు వరవరరావు

విరసం సభ్యుడు వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది బాంబే హైకోర్టు. ఆయన కుటుంబ సభ్యులు దాఖలు చేసిన బెయిల్​ పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

Varavara Rao
విరసం సభ్యుడు వరవరరావు

By

Published : Nov 18, 2020, 2:05 PM IST

జైలులో ఉన్న విప్లవ రచయితల సంఘం సభ్యుడు వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలించేందుకు అనుమతిచ్చింది బాంబే హైకోర్టు. చికిత్స నిమిత్తం 15 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచాలని ఆదేశించింది. దీనికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పేర్కొంది. ఆసుపత్రి నిబంధనల మేరకు కుటుంబ సభ్యులు ఆయన్ని కలిసేందుకు అగీకారం తెలిపింది కోర్టు.

వరవరరావు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు బెయిల్‌ మంజూరు చేయాలని, చికిత్స కోసం నానావతి ఆసుపత్రికి తరలించాలని ఆయన భార్య హేమలత దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ బెయిల్​ పిటిషన్​ను వ్యతిరేకించింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ)

ఇదీ చూడండి: వరవరరావు ఆరోగ్య స్థితిపై వైద్యులకు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details