BHEL Apprentice Jobs 2023 : మహారత్న హోదా కలిగిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL) 680 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ - 179 పోస్టులు
- టెక్నీషియన్ అప్రెంటీస్ - 103 పోస్టులు
- ట్రేడ్ అప్రెంటీస్ - 398 పోస్టులు
- మొత్తం పోస్టులు - 680
విభాగాల వారీగా పోస్టుల వివరాలు
- అకౌంటెంట్ - 6
- అసిస్టెంట్ (HR) - 10
- సివిల్ ఇంజినీరింగ్ - 34
- కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ - 9
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ - 6
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజినీరింగ్ - 23
- మెకానికల్ ఇంజినీరింగ్ - 91
- మొత్తం పోస్టులు - 179
టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల వివరాలు
- సివిల్ ఇంజినీరింగ్ - 7
- కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ - 9
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ - 17
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజినీరింగ్ - 8
- ఇన్స్ట్రుమెంటేషన్ - 4
- మెకానికల్ ఇంజినీరింగ్ - 58
- మొత్తం పోస్టులు - 103
ఐటీఐ అప్రెంటీస్ పోస్టుల వివరాలు
- ఏసీ మెకానిక్ - 5
- కార్పెంటర్ - 3
- ఎలక్ట్రీషియన్ - 36
- ఫిట్టర్ - 178
- ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ - 9
- మెషినిస్ట్ - 28
- మాసన్ - 6
- మోటార్ మెకానిక్ - 8
- ప్లంబర్ - 2
- టర్నర్ - 23
- వెల్డర్ - 100
- మొత్తం పోస్టులు - 398
విద్యార్హతలు
BHEL Apprentice Qualifications :అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా.. ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.