Factory Blast: గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటల్లో తొమ్మిది మంది కార్మికులు గాయపడ్డారు. సిహోర్ పట్టణానికి సమీపంలోని అరిహంత్ ఫర్నేస్ రోలింగ్ మిల్లో శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం సంభవించింది.
అకస్మాత్తుగా పేలుడు జరిగిన సమయంలో కార్మికులు ఫ్యాక్టరీలోనే ఉన్నారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను భావ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.