వైసీపీ పాలనలో ల్యాండ్ స్కామ్, లిక్కర్ స్కామ్ జరుగుతోంది: జేపీ నడ్డా - వైసీపీ వర్సెస్ బీజేపీ
18:45 June 10
ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది: జేపీ నడ్డా
Bharatiya Janata Party national president JP Nadda:భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఏపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటన సందర్భంగా.. శ్రీకాళహస్తిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఏపీలో జగన్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందని జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. ల్యాండ్ స్కామ్, లిక్కర్ స్కామ్ జరుగుతోందని విమర్శించారు. ఏపీలో అభివృద్ధి నిలిచిపోయిందన్న నడ్డా... రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో అమరావతి అభివృద్ధికి కేంద్రం అండదండలు అందించిందని నడ్డా వెల్లడించారు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని జేపీ నడ్డా ఆరోపించారు. బీజేపీ ఒక్క అవకాశం ఇస్తే.. అభివృద్ధి ఏంటో చూపిస్తామని నడ్డా వెల్లడించారు. రాయలసీమ ప్రాంతం దశాబ్దాలుగా వెనుకబడిందన్న నడ్డా.. బీజేపీకి అవకాశం ఇస్తే రాయలసీమను ప్రగతి పథం వైపు మళ్లిస్తామని హామీ ఇచ్చాడు.
ఆంధ్రప్రదేశ్‌కు మోదీ సర్కార్ ఏం చేసిందో రాష్ట్ర ప్రజలకు తెలుసన్న నడ్డా, ప్రధాని మోదీ ఎప్పుడూ ఓటు బ్యాంక్ రాజకీయలను చేయరని పేర్కొన్నారు. మోదీ ఓటు బ్యాంకు రాజకీయాలను బాధ్యతాయుతమైన రాజకీయాల వైపు మళ్లించారని నడ్డా పేర్కొన్నారు. దేశమంతా అభివృద్ధి జరగాలనే విధానం వైపే మోదీ మొగ్గు చూపారని వెల్లడించారు. మోదీ ప్రధాని అయ్యే నాటికి విద్యుత్ లేని గ్రామాలు 19 వేలు ఉండేవన్న జేపీ నడ్డా.. ఇవాళ దేశంలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామమే లేదని పేర్కొన్నాడు. గతంలో 59 గ్రామాలకే ఫైబర్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం ఉండేదని.. ఇప్పుడు ఎకంగా... ఇప్పుడు 2 లక్షలకు పైగా గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఉందని తెలిపారు. మోదీ సర్కార్ దేశంలో 50 కోట్ల మందికి రూ.5 లక్షల చొప్పున బీమా సౌకర్యం కల్పించిందని జేపీ నడ్డా పేర్కొన్నారు. పేద ప్రజల చికిత్సల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకూ సుమారు రూ.80 వేల కోట్లు ఖర్చు చేసిదని అన్నారు. ఉజ్వల పథకం కింద బీజేపీ ప్రభుత్వం 9 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందని గుర్తుచేశారు. ఒకప్పుడు 92 శాతం సెల్‌ఫోన్లు దిగుమతి అయ్యేవని.. అయితే, మోదీ మెకిన్ ఇండియా నినాధం వల్ల ప్రస్తుతం 97 శాతం సెల్‌ఫోన్లు దేశంలోనే తయారవుతున్నాయని పేర్కొన్నారు.
కేంద్రం పథకాలపై జగన్ ఫొటోలు:రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ అభివృద్ధి కనిపించడం లేదని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆరోపించారు. ఏపీకి ప్రధాని మోదీ ఏం చేస్తున్నారో వివరించాల్సిన అవసరం ఉందని వీర్రాజు పేర్కొన్నాడు. మోదీ ఇచ్చే బియ్యంపై సైతం జగన్ తన ఫొటోలు వేసుకుంటున్నారని సోమువీర్రాజు ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీకి కేంద్రం 40 లక్షల ఇళ్లు ఇస్తే... అందులో కనీసం 20 లక్షల ఇళ్లు కూడా నిర్మించలేదని వెల్లడించారు. ప్రజల అవసరాల కోసం నిర్మించే రైల్వే లైన్లకు రాష్ట్రం పావలా వంతు నిధుల సైతం ఇవ్వడం లేదని వెల్లడించారు. గ్రామీణ సడక్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రోడ్లు వేయిస్తుంటే... ఏపీలో జగన్ మాత్రం ఆ విషయం చెప్పడం లేదని అని సోము వీర్రాజు విమర్శించారు.