తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్​కు అనుమతివ్వండి' - కొత్త రకం కరోనా వైరస్

ఔషధ తయారీ సంస్థ జైడస్ క్యాడిలా... కొవిడ్​ నివారణ కోసం తాము తయారు చేస్తోన్న 'జైకొవ్-డి' వ్యాక్సిన్​ మూడో దశ క్లినికల్​ ప్రయోగాల కోసం అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. త్వరలోనే టీకా అందుబాటులోకి రానుందని ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు కొత్త రకం కరోనా వైరస్​ నివారణకు కూడా తమ వ్యాక్సిన్లు పనిచేస్తాయని మోడెర్నా చెబుతోంది.

Zydus Cadila seeks Phase 3 clinical trials approval for its Covid-19 vaccine
'మూడోదశ క్లినికల్‌ ప్రయోగాలకు అనుమతివ్వండి'

By

Published : Dec 25, 2020, 8:20 AM IST

కొవిడ్‌ మహమ్మారి నివారణ కోసం మరో టీకా సిద్ధమవుతోంది! తాము అభివృద్ధి చేసిన 'జైకొవ్‌-డి' వ్యాక్సిన్‌ తొలి, రెండో దశ క్లినికల్‌ ప్రయోగాలను విజయవంతంగా పూర్తిచేసుకుందని ఔషధ తయారీ సంస్థ జైడస్‌ క్యాడిలా గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మూడో దశ క్లినికల్‌ ప్రయోగాల కోసం ప్రభుత్వ అనుమతి కోరినట్లు తెలిపింది. సంబంధిత అనుమతులు లభించాక దాదాపు 30 వేల మంది వలంటీర్లపై ఈ ప్రయోగాలు నిర్వహిస్తామని పేర్కొంది. రెండో దశ ప్రయోగాలను వెయ్యి మందికి పైగా వలంటీర్లపై పూర్తిచేశామని వెల్లడించింది. టీకా సురక్షితమని, కరోనా వైరస్‌పై రోగ నిరోధక శక్తిని ప్రేరేపిస్తోందని అందులో తేలినట్లు వివరించింది.

కొత్త వైరస్‌పై పరీక్షిస్తాం : మోడెర్నా

కొత్త రకం కరోనా వైరస్‌పై తమ టీకా విజయవంతంగా పనిచేసే అవకాశాలున్నాయని మోడెర్నా భావిస్తోంది. ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకుగాను మార్పునకు గురైన వైరస్‌పై త్వరలోనే పరీక్షలు జరపనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. మోడెర్నాతో పాటు ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా కూడా తమ టీకాలు సమర్థంగా పనిచేస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ చదవండి:'విశ్వభారతి' ఆహ్వానంపై దీదీ-నడ్డా మధ్య రగడ

ABOUT THE AUTHOR

...view details