తెలంగాణ

telangana

By

Published : Apr 16, 2020, 8:05 PM IST

ETV Bharat / bharat

వాటి కోసం 'జూమ్' ​వాడకం సురక్షితం కాదు: కేంద్రం

లాక్​డౌన్​ కారణంగా వీడియో సమావేశాలకు వినియోగిస్తున్న 'జూమ్​' మీటింగ్​ యాప్​ సురక్షితం కాదని హోంమంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ప్రభుత్వ అధికారులెవ్వరూ ఈ ప్లాట్​ఫాంను ఉపయోగించొద్దని పేర్కొంది.

Zoom app not safe, avoid for official use: Govt warns
వాటి కోసం 'జూమ్' ​వాడకం సురక్షితం కాదు: కేంద్రం

జూమ్​ ద్వారా వీడియో కాన్ఫరెన్స్​ శ్రేయస్కరం కాదని హెచ్చరింది కేంద్ర ప్రభుత్వం. భద్రతాపరంగా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున ఈ యాప్​ను అధికారిక ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని హోం మంత్రిత్వ శాఖ సూచించింది.

ఈ మేరకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. ఇటీవల కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్​ టీం(సెర్ట్​-ఇన్​) జారీ చేసిన హెచ్చరికను మార్గదర్శకాల్లో ఉద్ఘాటించింది.

దేశంలో కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్​డౌన్​ ప్రకటించగా.. చాలా మంది ఇంటి నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సమయాల్లో సమావేశాలు నిర్వహించేందుకు జూమ్​ యాప్​ను వినియోగిస్తున్నారు. అయితే ఈ ప్లాట్​ఫాంలో భద్రత లేదని స్పష్టం చేసింది కేంద్రం. ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా ఇప్పటికీ జూమ్​ను వినియోగించాలని అనుకుంటే ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలని సూచించింది.

ABOUT THE AUTHOR

...view details