తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంట్లోకి చొరబడి ఉగ్రవాదుల కాల్పులు- యువకుడి మృతి - A youth was shot dead by militants in Baramulla district of Jammu and Kashmir

జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులు ఓ యువకుడిని కాల్చి చంపారు. శనివారం రాత్రి 9:30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు స్పష్టం చేశారు.

Youth shot dead by militants in Baramulla: Police
ఇంట్లోకి చొరబడి ఉగ్రవాదుల కాల్పులు- యువకుడి మృతి

By

Published : Jun 6, 2020, 11:25 PM IST

Updated : Jun 7, 2020, 12:52 AM IST

జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలో ఓ యువకుడిని కాల్చి చంపారు.

బొమయిలోని అడిపొరా ప్రాంతంలో నివాసం ఉండే ఇష్ఫాక్​ అహ్మద్ నాజర్(25) అనే యువకుడిపై ఉగ్రవాదులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి 9:30 గంటలకు ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపినట్లు వెల్లడించారు.

ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన నాజర్​ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:ప్రముఖ ఆసుపత్రిపై ఎఫ్​ఐఆర్​.. కారణం!

Last Updated : Jun 7, 2020, 12:52 AM IST

ABOUT THE AUTHOR

...view details