పౌరసత్వ చట్ట సవరణపై ఒక వర్గానికి చెందిన యువతను తప్పుదోవపట్టిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దీని ద్వారా ఎవరి పౌరసత్వాన్ని తొలగించమని హామీనిచ్చారు.
రెండు రోజుల బంగాల్ పర్యటనలో ఉన్న మోదీ.. ఈ రోజు ఉదయం బేలూర్ మఠాన్ని సందర్శించారు. అనంతరం జరిగిన సభలో సీఏఏను ప్రస్తావించారు. పౌర చట్టంపై ఉన్న సందేహాలను తొలగించడం తమ బాధ్యతగా పేర్కొన్న ప్రధాని.. రాజకీయ లబ్ధి కోసం విపక్షాలు యువతను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు.
"పౌర చట్టం (సీఏఏ) ద్వారా మేము పౌరసత్వాన్ని కల్పిస్తున్నాం. ఎవరి పౌరసత్వాన్ని తొలగించట్లేదు. ఇది కాకుండా.. ఈ రోజు ఏ ధర్మాన్నైనా పాటించే వ్యక్తి.. దైవత్వాన్ని నమ్మినా, నమ్మకపోయినా పర్లేదు. భారత రాజ్యాంగంపై విశ్వాసం ఉన్న వ్యక్తికి ప్రభుత్వ ప్రక్రియల అనంతరం పౌరసత్వాన్ని కల్పిస్తాం. ఇదంతా మీకు అర్థమైందా?అర్థమైంది కదా? విద్యార్థులకు కూడా అర్థమైంది కదా? కానీ రాజకీయాలు చేసేవారు మాత్రం ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి సిద్ధంగా లేరు."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.