తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పట్టపగలు కత్తులతో యువకుడిపై దాడి! - three youth attack in Punjab

పంజాబ్​లో దారుణం జరిగింది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ యువకుడిపై ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

youth being attacked in market in broad daylight, cctv captured
ఓ యువకుడిపై మరో ముగ్గురు కత్తులతో దాడి

By

Published : May 20, 2020, 6:13 PM IST

పంజాబ్​లోని గియాస్‌పురాలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిపై దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఇదీ జరిగింది!

నాగమణి అనే వ్యక్తి ఓ వైపు నుంచి బైక్​ మీద వస్తున్నాడు. ఎదురుగా మరో బైక్​పై వచ్చిన ముగ్గురు యువకులు నాగమణి బైక్​ను ఢీ కొట్టారు. అనంతరం కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయాలైనంతవరకు కసితీర నరికి పారిపోయారు. అందులో ఇద్దరు ముఖానికి ముసుగులు ధరించారు.

స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీఐ​ ఇంద్రజిత్​ సింగ్​​ చెప్పారు.

ఓ యువకుడిపై మరో ముగ్గురు కత్తులతో దాడి

ఇదీ చూడండి:50-30 లాక్​డౌన్​ వ్యూహంతో కరోనా కట్టడి!

ABOUT THE AUTHOR

...view details