తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బస్సులో యువతికి తాళి కట్టబోయిన యువకుడు - బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టబోయిన యువకుడు

ప్రేమ నిరాకరించిన ఓ యువతికి బలవంతంగా తాళికట్టడానికి ప్రయత్నించి ఓ యువకుడు పోలీసులకు చిక్కిన ఘటన తమిళనాడు వెల్లూరులో జరిగింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడం, తోటి ప్రయాణికులు అప్రమత్తమై నిందితునికి దేహశుద్ధి చేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.

Youth attempt to tie Mangalya in a running bus
బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టబోయిన జగన్​

By

Published : Dec 11, 2019, 11:13 AM IST

Updated : Dec 11, 2019, 2:48 PM IST

బస్సులో వెళ్తున్న ఓ యువతికి బలవంతంగా తాళి కట్టడానికి ప్రయత్నించిన ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన తమిళనాడు వెల్లూరులో జరిగింది. అంబూరు సమీపంలోని సాండ్రోర్ కుప్పం ప్రాంతానికి చెందిన జగన్​ స్థానికంగా ఉంటున్న ఓ యువతిని కళాశాల రోజుల నుంచి ప్రేమిస్తున్నాడు. అయితే ఆమెకు ఆ విషయం ఎప్పుడూ చెప్పలేదు.

ఇటీవలే ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి కుదిరింది. విషయం తెలుసుకున్న జగన్​.. యువతిని ప్రేమిస్తున్నట్లు తెలిపాడు. ఆమె నిరాకరించడం వల్ల ఆగ్రహంతో ఊగిపోయాడు. మంగళవారం ఉదయం ఆ యువతి అంబూరు నుంచి వాణియంబాడికి బస్సులో వెళుతుండడం చూసి తను కూడా వాహనం ఎక్కాడు. తన వెంట తెచ్చుకున్న తాళిని ఆమెకు బలవంతంగా కట్టే ప్రయత్నం చేశాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడం వల్ల తోటి ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. జగన్​ను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితునిపై కేసు నమోదుచేశారు.

ఇదీ చూడండి:విద్యార్థినులపై వేధింపులు.. చితకబాదిన మహిళా కానిస్టేబుల్​

Last Updated : Dec 11, 2019, 2:48 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details