టిక్టాక్ వ్యసనంతో యువత వింత పోకడలను అనుసరిస్తోంది. టిక్‌టాక్‌లో ఎక్కువ లైక్‌లు పొందేందుకు ఇద్దరు యువకులు చేసిన చర్య వారిని కటకటాల పాలు చేసింది. మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ జిల్లా మాల్హాఘర్‌కు చెందిన రాహుల్, కన్హయ్య టిక్ టాక్‌లో వీడియోలను రూపొందించేందుకు 25 వేల రూపాయలు చెల్లించి అక్రమ మార్గంలో తుపాకీ కొనుగోలు చేశారు.
అనంతరం బైక్‌పై వెళ్తూ టిక్‌టాక్ వీడియో రూపొందించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారి.. పోలీసుల దృష్టికి వెళ్లింది.