తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టికెట్టు తీసుకోలేదని బస్సు నుంచి తోసేశాడు!

బస్సు టికెట్టు తీసుకోలేదని ఓ విద్యార్థిని బలవంతంగా బయటకు నెట్టేసిన ఘటన కర్ణాటక బెంగళూరులో జరిగింది. విద్యార్థిని గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పై అధికారులు కండక్టర్​ను సస్పెండ్ చేశారు.

టికెట్టు తీసుకోలేదని బస్సు నుంచి తోసేశాడు!

By

Published : Nov 19, 2019, 11:29 PM IST

టికెట్టు తీసుకోవడానికి నిరాకరించిన ఓ విద్యార్థినిని.. కండక్టర్​ బలవంతంగా బయటకు నెట్టేసిన దారుణ ఘటన కర్ణాటక బెంగళూరులో జరిగింది. ఈ అమానవీయ చర్యకు పాల్పడిన కండక్టర్ శివశంకర్​ను అధికారులు సస్పెండ్​ చేశారు.

ఇదీ జరిగింది..

పీయూసీ చదువుతున్న ఓ విద్యార్థిని బస్సు ఎక్కింది. కండక్టర్ శివశంకర్ టికెట్​ తీసుకోమని ఆమెను కోరాడు. అయితే బస్సు పాస్ తన వద్ద ఉందని, టికెట్ తీసుకోనని ఆమె చెప్పింది. దీనితో ఆగ్రహం వక్తం చేసిన శివశంకర్​.. ఆమెను బస్సు దిగాలని గదమాయించాడు. తరువాతి బస్సు స్టేషన్​లో దిగుతానని విద్యార్థిని చెప్పింది. అయినా వినిపించుకోకుండా ఆమెను బలవంతంగా బస్సు నుంచి బయటకు తోసేశాడు. ఫలితంగా విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ప్రజల కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధం: రజనీ, కమల్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details