తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిట్రోడా బహిరంగ క్షమాపణలు చెప్పాలి: రాహుల్ - Rahul

1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై కాంగ్రెస్​ నేత శ్యాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనన్నారు పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. ఈ అంశంపై దేశ ప్రజలను బహిరంగంగా క్షమాపణలు కోరాలని సూచించారు​.

పిట్రోడా బహిరంగ క్షమాపణలు చెప్పాలి: రాహుల్

By

Published : May 13, 2019, 6:10 PM IST

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి కాంగ్రెస్​ నేత శ్యాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ మరోసారి స్పందించారు. ఆయన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని పంజాబ్​లోని ఫతేగఢ్​ ఎన్నికల ర్యాలీలో అన్నారు.

పిట్రోడా బహిరంగ క్షమాపణలు చెప్పాలి

"1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై శ్యాం పిట్రోడా వ్యాఖ్యలు తప్పు. అందుకు పిట్రోడా దేశ ప్రజలను క్షమాపణలు కోరాలి. ఈ విషయాన్ని నేను బహిరంగంగా చెబుతున్నాను. ఇదే విషయాన్ని పిట్రోడాకు ఫోన్​ ద్వారా చెప్పాను. పిట్రోడా.. మీరు చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే. అందుకు మీరు సిగ్గుపడాలి. ఈ వ్యాఖ్యలపై మీరు తప్పక క్షమాపణలు చెప్పాలి. "
- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

పిట్రోడా వ్యాఖ్యలు

సిక్కుల ఊచకోతపై జస్టిస్ నానావతి కమిషన్ నివేదిక ప్రకారం.. అల్లర్లపై అప్పటి ప్రధాని కార్యాలయం నుంచే ఆదేశాలు వెళ్లాయని భాజపా గతంలో ఆరోపించింది. ఈ ఆరోపణలకు సమాధానమిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పిట్రోడా.

"1984 గురించి ఇప్పుడెందుకు? అయిందేదో అయిపోయింది. ఐదేళ్లలో ఏం చేశారో దాని గురించి మాట్లాడండి." అని వ్యాఖ్యానించారు పిట్రోడా.

పిట్రోడా వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మాటలు... కాంగ్రెస్​ దురహంకారానికి ప్రతీక అని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్రమోదీ.

ఇదీ చూడండి : 'పిట్రోడా వ్యాఖ్యలు దురహంకారానికి ప్రతీక'

ABOUT THE AUTHOR

...view details