2005లో జరిగిన అయోధ్య ఉగ్రదాడి ఘటనలో నలుగురు నిందితులను దోషులుగా నిర్ధరిస్తూ అలహాబాద్ ప్రత్యేక కోర్టు నేడు తీర్పునిచ్చింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోర్టు తీర్పును స్వాగతించారు.
మరో నిందితుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసినందున చట్టపరమైన పరిశీలనల అనుగుణంగా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఈ కేసుపై ప్రభుత్వ నిఘా ఉంటుందని యోగి ప్రకటించారు.
2005 జులై 5న అయోధ్యలో జరిగిన ఈ ఉగ్రదాడిలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు.
అనంతరం ఐదుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. ఈ దాడి జరిగిన 14 ఏళ్ల తర్వాత నలుగురు నిందితులను దోషులుగా తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం వారికి జీవితఖైదు విధించింది. ఒక నిందితుడిని నిర్దోషిగా పేర్కొంది. దోషులందరికీ ప్రత్యేక న్యాయమూర్తి దినేశ్ చంద్ర 2 లక్షల 40 వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు
ఇదీ చూడండి : పుల్వామాలో ఉగ్రమూకల మరో ఘాతుకం