తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హోంగార్డులకు సర్కార్ షాక్​- 25 వేలమంది తొలగింపు

యూపీ ప్రభుత్వం హొంగార్డులకు షాక్​ ఇచ్చింది. ఏకంగా 25 వేల మందిని విధుల నుంచి తొలగించింది. ఆర్థిక సమస్యలే ఇందుకు కారణమని చెప్పింది.

హోంగార్డులకు యోగి సర్కార్ షాక్​- 25వేలమంది తొలగింపు

By

Published : Oct 15, 2019, 6:49 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం పోలీస్ ​శాఖకు సంబంధించి కఠిన నిర్ణయం తీసుకుంది. దీపావళికి ముందు ఏకంగా 25 వేల హోంగార్డులను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానిస్టేబుళ్లకు సమానంగా హోంగార్డులకు జీతం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించిన... అనంతరం యోగి ఆదిత్యానాథ్​ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఏడాదిలోనే...

పోలీస్​ శాఖలో ఖాళీలను పూడ్చడానికి గతేడాది 25 వేల మంది హోంగార్డులను ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం నియమించింది. వీరిలో అనేక మంది ట్రాఫిక్​ నియంత్రణ వ్యవస్థలోనే పనిచేస్తున్నారు. వీరిని తొలగిస్తే ట్రాఫిక్​ సమస్య పెరిగిపోయే అవకాశముంది.

వీరితో పాటు 99 వేల హోంగార్డుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ప్రభుత్వం వారి పని దినాలను 25 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించడమే ఇందుకు కారణం.

లెక్కలతోనే చిక్కులు...

ఆర్థిక సమస్య వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు.

హోంగార్డులకు రోజువారీ జీతం రూ. 500గా ఉండేది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అది రూ.672కు చేరింది. దీని వల్ల ఉత్తర్​ప్రదేశ్​ పోలీసు శాఖలో ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తాయి.

హోంగార్డులకు నెల జీతం విధానం లేదు. పనిదినాల ఆధారంగానే జీతం అందుతుంది.

ఇదీ చూడండి: బ్యాటింగ్​, బౌలింగ్​ వీడి.. నటన వైపు భారత క్రికెటర్లు!

ABOUT THE AUTHOR

...view details