దేశ తొలిప్రధాని జవహర్లాల్ నెహ్రూపై పరోక్ష విమర్శలు చేశారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. విలీన ప్రక్రియ ఆయన సరిగా చేయనందువల్లే ఇంకా జమ్మూకశ్మీర్ అంశం సమస్యాత్మకంగా ఉందన్నారు.
బిహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో జరిగిన వ్యవసాయ శిక్షణ కేంద్రం శంకుస్థాపన సభలో మాట్లాడారు యోగి.
మాట్లాడుతున్న యోగి ఆదిత్యనాథ్
" వల్లభాయ్ పటేల్.. దాదాపు 562 సంస్థానాలను భారత్లో విలీనం చేశారు. అక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. హైదరాబాద్, జునాగఢ్ పాలకులు ఎదురుతిరిగేందుకు ప్రయత్నించారు. కానీ వారిని పటేల్ దారికి తెచ్చారు. ఇప్పుడు అక్కడ ఎలాంటి సమస్యలు లేవు. జమ్మూకశ్మీర్ విలీన బాధ్యతను అప్పటి ప్రధాని పండిట్ నెహ్రూ తీసుకున్నారు. అప్పుడు ప్రారంభమైన వివాదం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. జమ్మూకశ్మీర్లో ప్రతిరోజూ ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయో అందరికీ తెలుసు.
-- యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ సీఎం