యోగా ఒక మతమో, రాజకీయ కార్యకలాపమో కాదని, అదో గొప్ప శాస్త్రమని వెంకయ్యనాయుడు అన్నారు. వ్యక్తిగత ఉన్నతికి దీనిని సాధన చేయాల్సిన అవసరముందని చెప్పారు. తమిళనాడు కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'మానవాళికి యోగా విజ్ఞానం మొదటిగా అందించినవాడు ఆ మహాశివుడు. ఈ యోగ ఒక నమ్మకం కాదు. మనసును మార్చుకునే సాంకేతికత' అని వెంకయ్యనాయుడు అన్నారు.
మోదీకి ధన్యవాదాలు
యోగాను ఐక్యరాజ్యసమితికి తీసుకువెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెబుతున్నానని వెంకయ్య అన్నారు. 'యోగా మోదీ కోసం కాదు. శరీరానికి' అని చమత్కరించారు. యోగాకు శాస్త్రీయ ప్రాతిపదిక ఉందని, ఐక్యరాజ్యసమితి... స్థిరమైన వృద్ధి సాధించడానికి యోగాను చేర్చిందన్నారు.
గొప్ప నాగరికత
'మన భారతీయ సంస్కృతి చాలా గొప్పది. ప్రపంచమంతా ఒకటే కుటుంబం అని నమ్మేవాళ్లం. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి భావం ఉండదు. ప్రజలంతా శాంతి, సామరస్యాలతో జీవించాలని కోరుకుంటామని' వెంకయ్య అన్నారు. ఈ గొప్ప సంస్కృతిని మనం కాపాడుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి:కశ్మీర్లో ఇద్దరు లష్కరేతోయిబా ఉగ్రవాదులు హతం