తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏనుగు మీద నుంచి కిందపడిన రామ్‌దేవ్‌ బాబా - రామ్​దేవ్​ బాబా వైరల్​ వీడియోస్​

యోగా గురు రామ్​దేవ్​ బాబా వీడియో ఒకటి సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఏనుగుపై కూర్చున్న బాబా.. ఉన్నట్టుండి కిందపడ్డారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలవ్వలేదు. కానీ.. వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతోంది.

Yoga guru Ramdev baba fell off an elephant, Video went viral
ఏనుగు మీద నుంచి కిందపడ్డ రామ్‌దేవ్‌ బాబా

By

Published : Oct 14, 2020, 11:42 PM IST

Updated : Oct 15, 2020, 9:58 AM IST

యోగా గురు రామ్‌దేవ్‌ బాబా మరోసారి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారారు. ఓ ఏనుగుపై ఆయన కూర్చొని యోగా చేస్తుండగా.. అదుపుతప్పి కింద పడిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు. అయితే.. ఉత్తర్‌ప్రదేశ్‌ మథురలోని రామన్‌ రెటి ఆశ్రమంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

22 సెకండ్ల ఈ వీడియోలో రామ్‌దేవ్‌ బాబా ఏనుగుపై కూర్చొని ఆశ్రమంలోని వ్యక్తులకు యోగాసనాలు నేర్పిస్తున్నట్లు కనిపించింది. అయితే.. ఏనుగు ఒక్కసారిగా పక్కకి కదలడం వల్ల దానిపై కూర్చున్న రామ్‌దేవ్‌ బాబా అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలూ కాలేదు. కిందపడిన రామ్‌దేవ్‌ బాబా లేచి దుమ్ము దులుపుకొని నవ్వుతూ నడిచివెళ్లారు. రామ్‌దేవ్‌ బాబాకు సంబంధించి ఇలాంటి వీడియోనే ఆగస్టు నెలలో వైరల్‌ అయ్యింది. సైకిల్‌పై వెళ్తూ ఆయన ఫౌంటేన్‌ వద్ద జారి పడ్డారు.

ఇదీ చదవండి:ఔరా అనామిక: ఎనిమిదో తరగతిలోనే టీచర్​ అయిన బాలిక!

Last Updated : Oct 15, 2020, 9:58 AM IST

ABOUT THE AUTHOR

...view details