కరోనా భయాందోళనల నడుమ ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని డిజిటల్ ప్లాట్‌ఫాం వేదికగా నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపింది. పెద్ద సంఖ్యలో గుమిగూడే కార్యక్రమాలేవీ చేయకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ఈ ఏడాది 'ఇంట్లోనే యోగా.. కుటుంబంతో యోగా' నినాదంతో జూన్ 21 ఉదయం 7 గంటలకు.. వర్చువల్ పద్దతిలో యోగా డే వేడుకలు జరుపుకోవాలని అధికారులు సూచించారు. విదేశాల్లో ఉన్న భారతీయ మిషన్లు.. డిజిటల్ మీడియా, యోగాకు మద్దతు ఇచ్చే సంస్థల నెటవర్క్ ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
లద్దాక్‌లోని లేహ్ ప్రాంతంలో 'యోగా డే'ని గొప్పగా నిర్వహించాలని గతంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రణాళిక రచించింది. ఈ వేడుకకు ప్రధాని మోదీ హాజరు కావాల్సి ఉంది. అయితే మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు.