యోగా, ఆధ్యాత్మిక సంస్థలు కలిసిమెలిసి ఒక్కటిగా ముందడుగేయాలని, పరస్పరం చేరువ కావాలని ఆధ్యాత్మిక గురువు కమలేష్ పటేల్ (దాజీ) పిలుపునిచ్చారు. ‘ఆయుష్’ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన అంతర్జాతీయ యోగ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో యోగా సాధకులు, సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు పలువురు పాల్గొన్నారు.
'యోగా, ఆధ్మాత్మిక సంస్థలు కలిసి పని చేయాలి' - యోగా, ఆధ్మాత్మిక సంస్థలు కలిసి పని చేయాలి
యోగా, ఆధ్యాత్మిక సంస్థలు కలిసిమెలిసి ఒక్కటిగా ముందడుగేయాలని ఆధ్యాత్మిక గురువు కమలేష్ పటేల్ (దాజీ) పిలుపునిచ్చారు. ఆయుష్’ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యోగ సదస్సులో ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.

యోగా, ఆధ్మాత్మిక సంస్థలు కలిసి పని చేయాలి
పరస్పరం ప్రేమాభిమానాలను పంచుకోలేని పక్షంలో యోగా గురించి మాట్లాడటంలో అర్ధం ఏముంది అంటూ దాజీ ఈ సందర్భంగా ప్రశ్నించినపుడు ఆహూతులు ఒక్కసారిగా లేచి నిలబడి కరతాళధ్వనులు చేశారు. దాజీ ప్రసంగంతో ఎంతో ఆనందానికి గురైన యోగా గురువు బాబా రాందేవ్ ఆప్యాయంగా ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఈ దఫా యోగాదినోత్సవాన్ని తాము హైదరాబాద్‌లోని ‘హార్ట్‌ఫుల్‌నెస్’ గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహిస్తామని రాందేవ్ చెప్పారు.
ఇదీ చూడండి:అంతా చూస్తుండగానే.. సినీ ఫక్కీలో వ్యక్తి కిడ్నాప్