ఈ సా.6గంటలకు సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం! - గవర్నర్
కర్ణాటకలో కొత్త సర్కారు కొలువుదీరనుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలని గవర్నర్ను కలిశారు యడ్యూరప్ప. ఈ సాయంత్రం 6గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.
![ఈ సా.6గంటలకు సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3949643-419-3949643-1564116335980.jpg)
నేడే సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విన్నవించారు. ఇవాళ ప్రమాణ స్వీకారం జరిపించాలని కోరినట్లు తెలుస్తోంది. నేడు సాయంత్రం 6 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది.