తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీం కోర్టులో ఒకే తాటిపైకి యడ్డీ, డీకే - భూవివాదం

కర్ణాటకలో భాజపా, కాంగ్రెస్​ మధ్య నువ్వంటే నువ్వు అన్నట్టు రాజకీయం నడుస్తోంది. ఇటీవల మూడు వారాల హైడ్రామాతో ఇరు పార్టీల మధ్య మాటల మంటలు తారస్థాయికి చేరాయి. అయితే అనూహ్యంగా భాజపా అగ్రనేత యడ్యూరప్ప, కాంగ్రెస్​ సీనియర్​ నేత డీకే శివకుమార్​ సుప్రీం కోర్టులో ఓ కేసు విషయమై ఒకే తాటిపైకి రావడం ఆసక్తి రేకెత్తించింది.

సుప్రీం కోర్టులో ఒకే తాటిపైకి యడ్డీ, డీకే

By

Published : Jul 26, 2019, 11:43 PM IST

భాజపా, కాంగ్రెస్​ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కర్ణాటకలో నాటకీయ పరిణామాలతో ఇరు పార్టీల నాయకులు విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వేడిని మరింత పెంచారు. అయితే సుప్రీం కోర్టులో ఓ కేసు విషయంలో భాజపా, కాంగ్రెస్​కు చెందిన అగ్రనేతలు బీఎస్​ యడ్యూరప్ప, డీకే శివకుమార్​ ఒకే తాటిపైకి వచ్చారు.

బెంగళూరులోని ఓ స్థలానికి సంబంధించిన అవినీతి కేసును తిరిగి తోడాలంటూ సుప్రీం కోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. '1991-కర్ణాటక భూ బదిలీ నియంత్రణ​ చట్టం' ఉల్లఘించి బెంగళూరులోని 4.20 ఎకరాల స్థలాన్ని డీనోటిఫికేషన్​ చేసారన్నది కేసు. అయితే ఈ కేసుకు సంబంధించి గతంలో ఫిర్యాదు చేసిన వ్యక్తి తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు.

తాజాగా ఈ కేసుకు సంబంధం లేని తృతీయ పక్షం.. బీఎస్​ యడ్యూరప్ప, డీకే శివకుమార్​కు ఈ కేసులో సంబంధముందటూ సుప్రీం కోర్టులో వ్యాజ్యం వేసింది.

యడ్యూరప్ప తరఫున ముకుల్​ రోహత్గి, డీకే శివకుమార్​ తరఫున అభిషేక్​ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఆ సమయంలో డీకే కోర్టు ఆవరణలోనే ఉన్నారు. ఇరువురు న్యాయవాదులు ఈ వ్యాజ్యం విచారణ యోగ్యం కాదని వాదించారు. ఈ కేసు ఫిర్యాదుదారు గతంలోనే పిటిషన్​ ఉపసంహరించినట్లు ప్రస్తావించారు.

విచారణ యోగ్యమైన వ్యాజ్యమో కాదో తెలియడానికి వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details