మోదీ సర్కార్ ఆరేళ్ల పాలన నిరాశామయంగా, దారుణంగా ఉందని కాంగ్రెస్ అభివర్ణించింది. ఎన్డీఏ 2.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది.
"మోదీ ఆరేళ్ల పాలనలో మతతత్వం పెరిగిపోయింది. వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా మోదీ సర్కార్ వివిధ వర్గాల మధ్య ఉన్న సోదర భావాన్ని నాశనం చేసింది."
- కె.సి.వేణుగోపాల్, కాంగ్రెస్ నేత
బాధ్యత గల రాజకీయ పార్టీగా
కరోనా సంక్షోభ సమయంలో ఎన్డీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వేణుగోపాల్ విమర్శించారు. సంక్షోభం సమయంలో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని భాజపా విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజల కష్టాలను ప్రభుత్వానికి తెలియజేయడం బాధ్యత గల ప్రతిపక్షంగా తమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ప్రభుత్వ వైఫల్యాలను తప్పకుండా ఎత్తిచూపుతామని స్పష్టం చేశారు.