ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మరణం పట్ల సర్వత్రా ఆవేదన వ్యక్తం అవుతోంది. దోషులకు వీలైనంత త్వరగా శిక్షపడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి మరణ శిక్షే సరైనదని ఆమె సోదరుడు అభిప్రాయపడ్డారు. ‘‘మా సోదరి ఇక మాతో లేదు. ఈ ఘోరానికి కారణమైన ఐదుగురి నిందితులకు మరణ శిక్ష విధించాలన్నదే నా ఏకైక డిమాండ్’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సత్వర న్యాయం జరగాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు.
.‘‘నా కూతురు మరణానికి కారణమైన వారిని పోలీసులు కాల్చి చంపితేనే నాకు నిజమైన ఓదార్పు. నాకు ఆర్థిక సహాయంగానీ ఇతర ఎలాంటి సహకారం అసవరం లేదు. పోలీసులు వారిని పరిగెత్తించి కాల్చి చంపాలి. లేదా ఉరి తీయండి. మమ్మల్ని వారు రోజూ వేధిస్తూనే ఉన్నారు. ధనబలంతో మాకు న్యాయం జరగకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారు. వారిని ఎదిరించే ధైర్యం గ్రామంలో ఎవరికీ లేదు. పైగా వారి బెదిరింపులను ప్రజలే వచ్చి మాకు చెబుతున్నారు’’