తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాగాల రక్తంపై చైనా పరిశోధనల వల్లే కరోనా? - కరోనా వైరస్​ ఎక్కడ పుట్టింది?

గబ్బిలాలను ఆవాసంగా చేసుకునే కరోనా వైరస్​లపై 2017లోనే పరిశోధనలు చేశారు అమెరికా, చైనా, భారత్​కు చెందిన వైరాలజీ శాస్త్రవేత్తలు. వుహాన్​ ల్యాబ్​లోని ఇద్దరు పరిశోధకులు కూడా ఇందులో భాగస్వాములయ్యారు. 2019 అక్టోబర్​లో ఈ పరిశోధనకు చెందిన జర్నల్​ను ప్రచురించింది పీఎల్​ఓఎస్. అ తర్వాత కొద్ది రోజులకే చైనాలో కరోనా విజృంభించింది. అందుకే కొవిడ్​-19 వైరస్ వుహాన్​ ల్యాబ్​లోనే పుట్టి ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అందులో నిజమెంత..?

Wuhan, US virologists research on Naga blood lead to corona virus origin!
నాగాల రక్తంపై చైనా 'బ్యాట్​ ఉమెన్'​ పరిశోధనల వల్లే కరోనా?

By

Published : Apr 27, 2020, 5:47 PM IST

కరోనా వైరస్​ ఎక్కడ పుట్టింది? ఎలా ఆవిర్భవించింది? వైరస్​ వ్యాప్తికి మూలం ఏమిటి? ఇప్పటికీ సరైన సమాధానాలు దొరకని ప్రశ్నలివి. అయితే ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారి వుహాన్​ ల్యాబ్​లోనే పుట్టిందని అమెరికా తీవ్రంగా ఆరోపిస్తోంది. మిగతా దేశాలు కూడా ఇవే అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.

ఈ ఆరోపణలకు ఓ కారణమూ ఉంది. గబ్బిలాల సంరక్షణపై అమెరికా, చైనా, భారత్​కు చెందిన వైరాలజీ (వైరస్, వాటి వల్ల కలిగే వ్యాధుల శాస్త్రము) శాస్త్రవేత్తల బృందం 2017లో పరిశోధనలు చేసింది. గబ్బిలాల్లో కరోనా వైరస్​ల పుట్టుకతో పాటు వాటి వ్యాప్తి, వ్యాక్సిన్​ అభివృద్ధి వంటి అంశాలపై పరిశోధించారు. ఇందుకోసం నాగాలాండ్​లోని ఓ మారుమూల గ్రామాన్ని ఎంచుకున్నారు. అక్కడ ఎన్నో ఏళ్లుగా గబ్బిలాల సంరక్షణ చూసుకుంటున్న ఓ నిర్దిష్ట తెగలోని ఏడుతరాలకు చెందిన 85 మంది నాగాల రక్త నమూనాలను సేకరించారు. ఆ శాంపిల్స్​పై పరిశోధనలు చేసిన చేసిన జర్నల్​ను.. 2019 అక్టోబర్​ 31న పీఎల్​ఓఎస్​ ప్రచురించింది.

'బ్యాట్​ ఉమన్​'

ఈ శాస్త్రవేత్తల బృందంలో వుహాన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీకి చెందిన షి జింగ్లీ, జింగ్​లూ యాంగ్​లు కూడా ఉన్నారు. సార్స్​ లాంటి కరోనా వైరస్ పరిశోధనల్లో జింగ్లీ నిష్ణాతులు. అందుకే ఈమెను చైనా 'బ్యాట్​ ఉమన్'​ అని కూడా పిలుస్తారు.​ సెంటర్​ ఫర్​ ఎమర్జింగ్​ ఇన్​ఫెక్షియస్ డిసీసెస్​ ​డైరెక్టర్​ బాధ్యతలూ జింగ్లీనే నిర్వహిస్తున్నారు. అయితే యాదృచ్ఛికంగా గతేడాదే కరోనా వైరస్​ వుహాన్​లో పుట్టడం, అది కాస్తా ప్రపంచ దేశాలకు సంక్రమించి లక్షలాది ప్రాణాలు బలితీసుకుంది. ఈ నేపథ్యంలో కొవిడ్​-19 వుహాన్​ ల్యాబ్​లోనే​ పుట్టి ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. అమెరికా సైతం ఇవే ఆరోపణలు చేస్తోంది.

నిధులు సమకూర్చింది అమెరికానే

ఇందులో మరో విశేషమేంటంటే.. ఈ పరిశోధనకు అమెరికాకు చెందిన యూఎస్​ డిపార్ట్​మెంట్​ ఆఫ్​ డిఫెన్స్​, ది డిఫెన్స్​ థ్రెట్​ రిడక్షన్​ ఏజెన్సీ (డీటీఆర్​ఏ), బయోలాజికల్​ డిఫెన్స్​ రీసెర్చ్​ డైరెక్టరేట్​ ఆఫ్​ ది నావల్​ మెడికల్​ రీసెర్చ్​ సెంటర్​లు నిధులు సమకూర్చాయి.

ABOUT THE AUTHOR

...view details