కాంగ్రెస్కు సారథి ఎంపికపై కొందరు నేతలు సోనియా గాంధీకి లేఖ రాయడాన్ని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తప్పుబట్టారు. ఇటువంటి సమయంలో ఆమెకు లేఖ రాయడం మంచి పని కాదన్నారు.
"నేను సీడబ్ల్యూసీ సభ్యుడిని కాదు. లేఖను చూడలేదు. కానీ లేఖ రాయడం, ఇలాంటి విషయాలు మీడియాకు లీక్ చేయడం సరికాదు. అయితే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం సీడబ్ల్యూసీలోని ఏ సభ్యుడైనా కమిటీ ముందు చర్చించాలని కోరవచ్చు "