తెలంగాణ

telangana

By

Published : Aug 8, 2020, 9:19 AM IST

Updated : Aug 8, 2020, 4:19 PM IST

ETV Bharat / bharat

కేరళ విమాన ప్రమాద మృతుల్లో ఒకరికి కరోనా

FLIGHT ACCIDENT
గగన విషాదం

15:13 August 08

ప్రమాద బాధితులందరికీ కరోనా పరీక్షలు..

విమాన ప్రమాదంలో మరణించిన వారితో పాటు బాధితులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఇప్పటివరకు ఒక్కరికే కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయిందని వెల్లడించింది.

15:01 August 08

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

కోజికోడ్​ విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది కేరళ ప్రభుత్వం. అలాగే గాయపడిన వారి చికిత్స ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు ముఖ్యమంత్రి పినరయి విజయన్​.  బాధితులను పరామర్శించి.. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం ఈ మేరకు పరిహారం ప్రకటించారు.

విమాన ప్రమాదంలో 18 మంది చనిపోగా అందులో 14 మంది పెద్దవారు, నలుగురు చిన్నారు ఉన్నారు. 149 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో 23 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 

14:54 August 08

'వందే భారత్​ మిషన్​ కొనసాగుతుంది'

వందే భారత్​ మిషన్​ విమానాల్లో ఎలాంటి సమస్య లేదని, ఈ మిషన్ ఎప్పటిలాగే​ కొనసాగుతుందని ప్రకటించింది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. కేరళ కోజికోడ్​ విమానాశ్రయంలో వందే భారత్​ మిషన్​ ఎయిర్​ ఇండియా విమానం ప్రమాదానికి గురైన నేపథ్యంలో ఈ మేరకు వెల్లడించింది. 

13:22 August 08

బాధితులకు పరిహారం 

విమాన ప్రమాదంలో మరణించిన వారికి పౌరవిమానయాన మంత్రి హర్​దీప్​ సింగ్​ పూరి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు తెలిపారు. అలాగే తీవ్రంగా గాయపడినవారికి రూ.2 లక్షలు, చిన్న గాయాలతో బయటపడ్డవారికి రూ.50 వేల చొప్పున చెల్లించనున్నట్లు వెల్లడించారు.

12:59 August 08

ఆసుపత్రికి సీఎం...

కేరళ గవర్నర్​ ఆరిఫ్​ మహ్మద్​ ఖాన్​, ముఖ్యమంత్రి పినరయి విజయన్​ కోజికోడ్​ ఆసుపత్రికి వెళ్లి విమాన ప్రమాద బాధితులను పరామర్శించారు.

12:50 August 08

పౌరవిమానయాన మంత్రి...

విమాన ప్రమాద స్థలాన్ని పౌరవిమానయాన మంత్రి హర్​దీప్​ సింగ్​ పూరి పరిశీలించారు. సహాయక చర్యలు సహా ఘటనపై సీనియర్​ అధికారులతో చర్చించనున్నట్లు తెలిపారు.

12:27 August 08

ఒకరికి కరోనా...

కేరళ కోజికోడ్​ విమాన ప్రమాదంలో మృతి చెందినవారిలో ఒకరికి కరోనా ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యల్లో పాల్గొన్న వారందరినీ స్వీయ నిర్బంధంలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వారికి కరోనా పరీక్షలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

11:50 August 08

డీఎఫ్​డీఆర్​ స్వాధీనం...

విమానం నుంచి బ్లాక్బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. ఇందులో ఉండే డిజిటల్‌ ఫ్లైట్‌ డేటా‌ రికార్డర్‌ (డీఎఫ్‌డీఆర్‌), కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్‌)లలో నిక్షిప్తమైన సమాచారాన్ని విశ్లేషించనున్నారు. దీని ద్వారా.. విమానం ఎత్తు, స్థితి, వేగానికి సంబంధించిన వివరాలతోపాటు.. ప్రమాద సమయంలో పైలట్ల మధ్య జరిగిన సంభాషణ వివరాలు కూడా లభించనున్నాయి. దీంతో ప్రమాదానికి గురైన ఎయిరిండియా ఐఎక్స్‌-1344 విమానంలో ఏం జరిగి ఉంటుందో తెలుసుకునే వీలవుతుందని అధికారులు తెలిపారు.

10:31 August 08

అందరికీ పరీక్షలు...

విమాన ప్రమాదం సహాయక చర్యల్లో పాల్గొన్న అందరికీ కరోనా​ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేరళ ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొన్నవారు స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు.

10:15 August 08

డీఎఫ్​డీఆర్​ సేకరణ...

ప్రమాదానికి గురైన విమానం నుంచి డిజిటల్​ ప్లైట్​ డేటా రికార్డర్​ (డీఎఫ్​డీఆర్​)ను సేకరించారు అధికారులు. కాక్​పిట్​ వాయిస్​ రికార్డర్​ (సీవీఆర్​) కోసం ప్రయత్నిస్తున్నట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు.

10:08 August 08

పరిశీలన...

విమాన ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్​ పరిశీలించారు. డీజీసీఏ దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు. పౌరవిమానయాన మంత్రి మధ్యాహ్నం 12 గంటలకు ఘటనా స్థలానికి వస్తారని స్పష్టం చేశారు. 

10:05 August 08

నేపాల్​ విదేశాంగ మంత్రి ట్వీట్

నేపాల్​ విచారం...

కేరళ విమాన ప్రమాదంపై విచారం వ్యక్తం చేసింది నేపాల్. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి ట్వీట్ చేశారు.

09:13 August 08

సీఎం, గవర్నర్...

విమాన ప్రమాదం జరిగిన ప్రదేశానికి కాసేపట్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​, గవర్నర్​ వెళ్లనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న వారిని పరామర్శించే అవకాశం ఉంది.

09:09 August 08

విమాన విషాదం: ఘటనా స్థలానికి సీఎం, కేంద్ర మంత్రి

కోజికోడ్ ప్రమాద ప్రదేశాన్ని పరిశీలించేందుకు కేంద్రమంత్రి హరిదీప్‌సింగ్ పూరి వెళ్లనున్నారు. కాసేపట్లో దిల్లీ నుంచి కోజికోడ్ బయల్దేరుతున్నట్లు విమానయానశాఖ అధికారులు తెలిపారు.

పెను విషాదం..

వందేభారత్‌ మిషన్‌లో భాగంగా దుబాయ్‌ నుంచి కోజికోడ్‌కు వస్తున్న ఎయిరిండియాకు చెందిన డీఎక్స్‌బీ-సీసీజే బోయింగ్ 737 ఐఎక్స్‌ 1344 విమానం రన్​వేపై దిగుతుండగా ఒక్కసారిగా అదుపుతప్పింది. అనంతరం పక్కనే ఉన్న 30 అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది. దీంతో విమానం రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికిపైగా గాయాలపాలయ్యారు.

ప్రమాదం జరిగిన విమానంలో 184 మంది(10 మంది చిన్నారులు) ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. శుక్రవారం రాత్రి 7.41 గంటలకు ప్రమాదం జరిగిందని, ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగలేదని స్పష్టం చేసింది.  

రన్​వేపై ల్యాండ్​ అయిన తర్వాత విమానం ముందుకు దూసుకెళ్లి లోయలో పడిపోయిందని డీజీసీఏ వెల్లడించింది.

Last Updated : Aug 8, 2020, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details