భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమాన ఆచూకీ లభించింది. 8 రోజుల గాలింపు తర్వాత... అరుణాచల్ ప్రదేశ్‌లోని లిపో ప్రాంతంలో ఈ విమాన శకలాలను ఎంఐ-17 హెలికాప్టర్ ద్వారా గుర్తించారు. విమానం బయల్దేరిన ఎయిర్‌బేస్ నుంచి 15-20 కిలోమీటర్ల దూరంలోనే ఈ శకలాలు ఉన్నాయి.
ఏఎన్-32 విమాన శకలాలు 8 రోజులకు గుర్తింపు - Wreckage
8 రోజుల క్రితం అదృశ్యమైన ఏఎన్-32 విమానం ఆచూకీ లభించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని లిపో ప్రాంతంలో విమాన శకలాలను గుర్తించారు.
ఏఎన్-32 విమాన శకలాలు 8 రోజులకు గుర్తింపు
జూన్ 3న అసోంలోని జోహ్రత్ ఎయిర్ బేస్ నుంచి బయల్దేరింది ఏఎన్-32 విమానం. చైనా సరిహద్దు సమీపంలోని మెన్చుక వద్ద దిగాల్సి ఉంది. కానీ గాల్లోకి ఎగిరిన కొద్దిక్షణాల్లోనే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఆ సమయంలో అందులో 8 మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు.
ఇదీ చూడండి:13 మంది సహా భారత యుద్ధ విమానం గల్లంతు
Last Updated : Jun 11, 2019, 5:21 PM IST