తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తుక్కుతో రూ.517కోట్లు ఆర్జించిన పశ్చిమ రైల్వే - పశ్చిమ రైల్వే

పశ్చిమ రైల్వే రికార్డు నెలకొల్పింది. రైల్వే యార్డులు, కార్యాలయాల నుంచి సేకరించిన చెత్తను  విక్రయించి ఏకంగా ఏడాదిలో రూ.517 కోట్లు ఆర్జించింది.

తుక్కుతో రూ.517కోట్లు ఆర్జించిన పశ్చిమ రైల్వే

By

Published : Mar 31, 2019, 3:00 AM IST

రైల్వే ప్రాంగణాల్లో పేరుకుపోయిన చెత్త, నిల్వ కార్యాలయాల్లో నిరుపయోగంగా ఉన్న ఇనుప తుక్కును విక్రయించి ఏడాదిలోనే రూ.517.5 కోట్లు ఆర్జించింది పశ్చిమ రైల్వే. ఇది రైల్వేల్లో సరికొత్త రికార్డు. గతంలో ఉత్తర రైల్వే రూ.403కోట్లకు చెత్తను విక్రయించింది. ఆ రికార్డును తిరగరాసింది పశ్చిమ రైల్వే.

అధికారిక కార్యాలయాలు, రైల్వే స్టేషన్​ల ప్రాంగణాల్లోని చెత్తను పూర్తిగా తొలగించేందుకు 'మిషన్ జీరో స్క్రాప్' పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు పశ్చిమ రైల్వే అధికారులు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని చీఫ్​ పీఆర్​వో రవిందర్ భాస్కర్ తెలిపారు.

ఇదీ చూడండి:చౌకీదార్​ కప్పులపై రైల్వేకు ఈసీ నోటీసులు

ABOUT THE AUTHOR

...view details