తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సాధ్వి.. శపిస్తే సరిపోయేది కదా?: దిగ్విజయ్​ - దిగ్విజయ్​ సింగ్

జైషే మహ్మద్ ఉగ్రవాద​ సంస్థ వ్యవస్థాపకుడు మసూద్​ అజార్​ను సాధ్వి ప్రజ్ఞాసింగ్​ ఠాకూర్​ శపించి ఉంటే, భారత్​ లక్షిత దాడులు చేయాల్సిన అవసరమే ఉండేది కాదని కాంగ్రెస్ నేత దిగ్విజయ్​ సింగ్ ఎద్దేవా చేశారు. భోపాల్​లో లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సాధ్వి.. శపిస్తే సరిపోయేది కదా?: దిగ్విజయ్​

By

Published : Apr 28, 2019, 10:57 AM IST

Updated : Apr 28, 2019, 12:47 PM IST

సాధ్వి.. శపిస్తే సరిపోయేది కదా?: దిగ్విజయ్​

మధ్యప్రదేశ్​ భోపాల్​లో లోక్​సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత దిగ్విజయ్​ సింగ్​... తన ప్రత్యర్థి, భాజపా నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్​పై విమర్శలు గుప్పించారు.

ఉగ్రవాదులపై పోరాడి అమరుడైన పోలీసు అధికారి హేమంత్​ కర్కరే తన శాపం వల్లే మరణించారని సాధ్వి ప్రజ్ఞా సింగ్​ లోగడ వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్​ పుల్వామాలో ఉగ్రదాడికి కారకుడైన మసూద్​ అజార్​ను సాధ్వి ప్రజ్ఞా సింగ్​​ శపించినట్లయితే... లక్షిత దాడులు చేయాల్సిన అవసరమే ఉండేది కాదని ఆయన ఎద్దేవా చేశారు.

భయపడ్డారు...

భోపాల్​లో తనపై పోటీ చేయడానికి భాజపా అభ్యర్థులు భయపడ్డారని దిగ్విజయ్​ సింగ్ అన్నారు. ఉమా భారతి పోటీ చేసేందుకు నిరాకరించారని, గౌర్​ తప్పుకున్నారని చెప్పారు. చివరికి గత్యంతరం లేక నామినేషన్​కు చివరి రోజు సాధ్వి ప్రజ్ఞాసింగ్​ను బరిలో నిలిపారని దిగ్విజయ్​ అన్నారు.

మధ్యప్రదేశ్​ భోపాల్​లో మే 12న పోలింగ్ జరగనుంది. మే 23న ఓట్లు లెక్కిస్తారు.

ఇదీ చూడండి: 'జిన్నా పేరు ఉచ్ఛరించడం పొరపాటు మాత్రమే'

Last Updated : Apr 28, 2019, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details