తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మద్యం జోరు.. మూడోరోజూ రికార్డు అమ్మకాలు

కర్ణాటకలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తొలి రెండు రోజుల్లో కలిపి రూ. 242 కోట్ల ఆదాయం రాగా.. బుధవారం ఒక్కరోజే 230 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు ప్రకటించారు.

Worth 230cr of Liquor Sold out in Karnataka on Wednesday
మద్యం జోరు.. మూడోరోజూ రికార్డు అమ్మకాలు

By

Published : May 7, 2020, 9:04 AM IST

దాదాపు 40 రోజుల లాక్​డౌన్​ అనంతరం మద్యం దుకాణాలు తెరుచుకోవడం వల్ల.. ప్రభుత్వాలకు భారీ ఆదాయం సమకూరుతోంది. ఆయా రాష్ట్రాల్లో జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి. కర్ణాటకలో తొలి రోజు రూ. 35 కోట్లు, రెండో రోజు 197 కోట్ల విలువైనమద్యం అమ్మకాలు జరగ్గా.. మూడో రోజు ఏకంగా 230 కోట్ల విలువైన మద్యం తాగారు మందుబాబులు. అయితే బార్లు తెరుచుకోవడమే ఆదాయం భారీగా పెరగడానికి కారణంగా తెలుస్తోంది.

ఎక్సైజ్​ వివరాల ప్రకారం.. రూ. 216 కోట్ల విలువ చేసే దాదాపు 7 లక్షల లీటర్ల బీర్లు అమ్ముడుపోయాయి. మద్యంపై పన్నులు పెంచినా.. ఇంతటి భారీ స్థాయిలో కొనుగోళ్లు జరగడం చూసి అధికారులే నోరెళ్లబెడుతున్నారు. ఈ నెల 4 నుంచి కర్ణాటకలో మద్యం అమ్మకాలకు అనుమతినిచ్చింది యడియూరప్ప ప్రభుత్వం.

ABOUT THE AUTHOR

...view details