గుజ్రాత్లోని రాజ్కోట్ జిల్లా అధికారులు ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 42 వేల కాగితాలతో 10.6 అడుగుల మువ్వన్నెల జెండాను తయారు చేస్తున్నారు. అరబ్ సంయుక్త దేశాలు నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 22 రోజులుగా శ్రమిస్తున్నారు.
'మువ్వన్నెల జెండాతో.. ప్రపంచ రికార్డు నెలకొల్పేస్తాం!' - gujt=rat rajkot national flag
గుజరాత్లోని రాజ్కోట్ ప్రపంచ రికార్డు సృష్టించనుంది. 42 వేల త్రిభుజాకార కాగితాలతో త్రివర్ణ పతాకాన్ని రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించనున్నారు అక్కడి అధికారులు. అరబ్ సంయుక్త దేశాలు నెలకొల్పిన రికార్డును పటాపంచలు చేయనున్నారు.
'మువ్వన్నెల జెండాతో.. ప్రపంచ రికార్డు నెలకొల్పేస్తాం!'
మూడు రంగుల కాగితాలను త్రిభుజాకారంలో మడిచి.. వాటితో జాతీయ జెండాను తయారు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే అరబ్ సంయుక్త దేశాల్లో 9.5 అడుగుల జాతీయ జెండాను తయారు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు రాజ్కోట్ వాసులు అంతకు ఒక అడుగు పొడవైన జెండాను రూపొందిస్తున్నారు.
ఇదీ చదవండి:గూడ్స్ రైల్లో చెలరేగిన మంటలు.. దగ్ధమైన బోగి
Last Updated : Jan 3, 2020, 9:26 AM IST