తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం వరదలకు 109 వన్యప్రాణులు బలి

అసోంలోని ప్రఖ్యాత కాజీరంగా జాతీయ పార్కును వరదలు ముంచెత్తాయి. ఫలితంగా ఇప్పటివరకు 109 జంతువులు మరణించినట్లు అధికారులు తెలిపారు.

By

Published : Jul 20, 2019, 4:54 PM IST

అసోం వరదలకు 109 వన్యప్రాణులు బలి

అసోం వరదలకు 109 వన్యప్రాణులు బలి
అసోంలో కురుస్తున్న భారీ వర్షాలకు వన్యప్రాణుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలోని ప్రఖ్యాత కాజీరంగా జాతీయ పార్కును వరదలు ముంచెత్తాయి. వరదల ఉద్ధృతికి సుమారు 109 వన్యప్రాణులు మృతి చెందాయి. వాటిలో 11 ఖడ్గమృగాలు, 86 జింకలు, ఒక ఏనుగు, 8 అడవి పందులు, 2 ముళ్ల పందులు ఉన్నాయి. వరదల్లో చిక్కుకున్న 2 ఖడ్గమృగాలు, ఒక ఏనుగును అటవీశాఖ అధికారులు రక్షించారు.

కాజీరంగా జాతీయ పార్కులోని జంతువులను ఎత్తైన ప్రాంతాలకు తరలించారు అధికారులు. కానీ ప్రస్తుతం వాటికి పెద్ద సమస్య ఎదురయింది. వరదలతో అటవీ ప్రాంతంలో ఆహారం దొరికే పరిస్థితులు లేవు. ఆ మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఆహారం కోసం వెతుక్కుంటూ.. జనావాసాల్లోకి వచ్చిన సందర్భాలూ ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details