తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రవాద నిర్మూలనకు కలిసిరావాలి: ఉపరాష్ట్రపతి - lal bahadur shastri national award for excellence

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై కఠినంగా వ్యవహరించాలని ఉద్ఘాటించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలను వేరు చేసి, వాటిపై ఆంక్షలు విధించడానికి ప్రపంచదేశాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు వెంకయ్య.

World community should isolate nations that sponsor terrorism: Vice-president
ఉగ్రవాద నిర్మూలనకు కలిసిరావాలి: ఉపరాష్ట్రపతి

By

Published : Nov 22, 2020, 7:32 AM IST

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను వేరు చేసి, వాటిపై ఆంక్షలు విధించడానికి ప్రపంచదేశాలు కలిసి రావాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని శాపంగా పేర్కొంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తికి తన ధాతృత్వానికి గానూ 'లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ అవార్డు 2020' అందజేత కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ.. 'ఉగ్రవాదం వల్ల ఏ దేశం సురక్షితంగా ఉండదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఐరాసలోనూ సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఐరాసలో భారత దీర్ఘకాల ప్రతిపాదన 'అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సమావేశంను ఆమోదించాలి. ఉగ్రవాదాన్ని పారదోలి, శాంతిని నెలకొల్పడానికి ప్రపంచదేశాలు ముఖ్యంగా దక్షిణాసియా దేశాలు కలిసి రావాలి' అని వెంకయ్య పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ గురించి మాట్లాడుతూ.. 'కరోనా కట్టడిలో వివిధ రంగాల్లోని ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ బాగా పనిచేశారని కొనియాడారు. కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ పరిస్థితులు ఏర్పడినప్పటికీ మన రైతులు శ్రమించి పంటలను పండించారన్నారు. ఈ సందర్భంగా లాల్‌బహదూర్‌ శాస్త్రికి నివాళులు అర్పించిన వెంకయ్య.. శాస్త్రి భారతదేశం గర్వించదగిన వ్యక్తి అని కొనియాడారు. రాజనీతిజ్ఞుడు, గొప్ప మానవతా దృక్పథం ఉన్న వ్యక్తిగా అభివర్ణించారు.

ఇదీ చూడండి:కాంగ్రెస్​ అధ్యక్ష పదవి కోసం 'డిజిటల్​' ఎన్నిక!

ABOUT THE AUTHOR

...view details