తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఈటీవీ భారత్' చొరవతో వలస కూలీలు సేఫ్​ - స్వదేశానికి లంకలోని భారత్​ వలస కూళీలు.. ఈటీవీ భారత్​కు కృతజ్ఞతలు​

శ్రీలంకలో చిక్కుకున్న పలువురు భారత వలస కూలీలను స్వదేశానికి తిరిగి రప్పించడంలో ఈటీవీ భారత్​ తనవంతు కృషి చేసింది. పొరుగు దేశంలో చిక్కుకున్న మొత్తం 11 మందిలో నలుగురు తమ సొంతూళ్లకు చేరుకునేలా చేసింది. అందుకే వీరందరూ ఈటీవీ భారత్​కు కృతజ్ఞతలు చెబుతున్నారు.

workers of Odisha return after being stranded in Srilanka. Thanked ETV Baharat
స్వదేశానికి లంకలోని భారత్​ వలస కూళీలు.. ఈటీవీ భారత్​కు కృతజ్ఞతలు​

By

Published : Jan 13, 2020, 12:14 PM IST

'ఈటీవీ భారత్' చొరవతో వలస కూలీలు సేఫ్​

ఈటీవీ భారత్​ చొరవతో శ్రీలంకలో చిక్కుకుపోయిన 11 మంది ఒడిశా వలస కార్మికుల్లో నలుగురు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. శ్రీలంకలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసేందుకు వెళ్లిన వీరందరితోనూ.. అక్కడి యజమాని సాధారణ సమయానికి మించి 15 గంటలు పని చేయించుకుంటున్నాడని బాధితులు వాపోయారు. ఉద్యోగం కల్పించిన వ్యక్తి తమను చిత్రవధకు గురిచేస్తున్నాడంటూ.. ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో పోస్టు చేశారు. అదే సమయంలో బాధితులను ఆదుకోవాలని ఈటీవీ భారత్​ రాసిన కథనానికి ఒడిశా ప్రభుత్వం స్పందించింది. తమ రాష్ట్ర ప్రజలైన 11 మందిని స్వదేశానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాసింది.

విషయం తెలుసుకున్న భారత దౌత్యాధికారులు మొత్తం 11 మందిలో నలుగురికి తాత్కాలిక ఎగ్జిట్​ వీసా కల్పించి శ్రీలంక నుంచి వచ్చేందుకు విమాన టిక్కెట్లను కల్పించారు. మిగతా వారిని కూడా స్వదేశానికి తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

సొంతూళ్లకు వచ్చిన వారిలో బంపుర్​ ఖొర్దా జిల్లాకు చెందిన దేవ్​రాజ్​ నాయక్​, ఆశిష్​ మహారాణా, పంకజ్​ ప్రధాన్​తో పాటు బాలేసోర్ జిల్లాకు చెందిన కిశాన్ తరై ఉన్నారు. తమను సురక్షితంగా స్వగ్రామాలకు చేరేలా చేసినందుకు ఈటీవీ భారత్​కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి : మహిళల టీ20 ప్రపంచకప్​కు భారత జట్టు ఇదే

For All Latest Updates

TAGGED:

Gangadhar Y

ABOUT THE AUTHOR

...view details