తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ 'మాట'ను రికార్డుల నుంచి తొలగించిన వెంకయ్య - modi latest news

రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు అరుదైన నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలోని ఓ మాటను రికార్డుల నుంచి తొలగించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రెటేరియేట్ అధికారిక ప్రకటన చేసింది.

word-from-modis-speech-in-rajya-sabha-expunged
మోదీ 'మాట'ను రికార్డుల నుంచి తొలగించిన వెంకయ్య

By

Published : Feb 7, 2020, 9:45 PM IST

Updated : Feb 29, 2020, 1:55 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో గురువారం చేసిన ప్రసంగంలోని ఓ మాటను రికార్డుల నుంచి తొలగించారు ఛైర్మన్​ వెంకయ్యనాయుడు. ప్రధాని ప్రసంగంలోని మాటలను రికార్డులను తొలగించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే వెంకయ్య ఆ మాటలను ఎందుకు తొలగించారు. అవేమైనా వివాదాస్పద వ్యాఖ్యలా? అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.

"రాజ్యసభలో ఫిబ్రవరి 6న జరిగిన కార్యకలాపాల్లో సాయంత్రం 6:20గంటల నుంచి 6:30 మధ్య జరిగిన వాటిని తొలగించాలని రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు ఆదేశించారు."
-రాజ్యసభ సెక్రటేరియేట్ ప్రకటన.

చాలా అరుదు..

రాజ్యసభలో రోజువారి కార్యకలపాల అనంతరం రికార్డులను పరిశీలిస్తారు ఛైర్మన్​. సభా విలువలకు తగినట్లు కాదని భావించిన పలు విషయాలను రికార్డుల నుంచి తొలగిస్తారు. ఇది జరగడం సాధారణమే అయినా.. ఓ ప్రధాని మాటలను రికార్డుల నుంచి తొలగించడం అరుదైన విషయం.

Last Updated : Feb 29, 2020, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details