వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఈటీవీ భారత్‌తో ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్నారు. పలు కీలక విషయాలపై మాట్లాడారు.
నూతన పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలను లక్ష్యంగా చేసుకుని రూపొందించింది కాదని వివరణ ఇచ్చారు గడ్కరీ. పాకిస్థాన్ వెళ్లాలని ఎవరినీ అడగబోమన్నారు. ఈ విషయంలో ప్రజల్ని కాంగ్రెస్ తప్పదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఈశాన్యంలో రాజుకున్న అగ్గికి ఆ పార్టీ వాయువును జోడిస్తోందని మండిపడ్డారు కేంద్రమంత్రి.
'కాంగ్రెస్ సహజగుణం'
ప్రజల భయాలతో రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీ సహజగుణం అని తీవ్ర విమర్శలు చేశారు గడ్కరీ. నూతన పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల ప్రజలు, ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టం సరైనదేనని..ఇది ఎవరి హక్కులకు భంగం కల్గించబోదని గడ్కరీ అన్నారు. ఈ చట్టం దేశ సంక్షేమం కోసమేనని.. రాజకీయాలకు తావులేదన్నారు గడ్కరీ.
"ఇతర దేశాల్లో శరణార్థులుగా ఉన్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లకు పౌరసత్వం కల్పిస్తాం. మేం ముస్లింలకు వ్యతిరేకం కాదు. వాళ్లని పాకిస్థాన్ వెళ్లాలని అడగడం లేదు. ఈ విషయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు."
-నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి.
ఝార్ఖండ్‌లో విజయంపై విశ్వాసం
ఝార్ఖండ్‌లో మరోసారి భాజపా అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు గడ్కరీ. ఆ రాష్ట్రంలో అభివృద్ధికి తమ పార్టీదే బాధ్యతన్నారు. సీఎం రఘుబర్‌దాస్ పనితీరును కొనియాడారు. బిహార్ నుంచి విడిపోయినపుడు ఝార్ఖండ్ పరిస్థితి బాగాలేదని... ప్రస్తుం బిహార్ కన్నా ముందువరుసలో ఉందని చెప్పారు గడ్కరీ.
హరియాణా, మహారాష్ట్రలో పరిస్థితులు వేరని.. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా కచ్చితంగా స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు గడ్కరీ.
మహా రాజకీయాలపై స్పందన..