ప్రధాని నరేంద్ర మోదీ తన సామాజిక మాధ్యమాల ఖాతాల నిర్వహణ బాధ్యతను మహిళలకు అందించటం పట్ల కొంత మంది మహిళా హక్కుల ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ చర్యను మానవత్వానికి సేవ చేస్తున్న మహిళకు అందిన గౌరవంగా అభివర్ణించారు.
"మహిళల ఎంపిక చాలా అద్భుతంగా ఉంది. సామాజిక మాధ్యమంలో 2 వేల మంది ఫాలోవర్స్ ఉన్న మహిళను ఎంపిక చేశారు. ఈమె గత ఐదేళ్ల నుంచి ఫుడ్ బ్యాంక్ నిర్వహిస్తోంది. ఈ బ్యాంక్ ద్వారా వేలాది మందికి ఆహారాన్ని అందిస్తోంది. కాబట్టి ప్రధాని నిజమైన మహిళను ఎంచుకున్నారు, కానీ నటించే వారిని కాదు."
మోనికా అరోరా, జాతీయ విద్యావేత్తల, మేధావుల బృంద కన్వీనర్
"బాంబు దాడి నుంచి తన ప్రాణాలను కాపాడుకున్న మరో మహిళను ప్రధాని ఎంచుకున్నారు. ఆమె జీవితం ఇతరులకు ఎంతో ప్రేరణను కలిగిస్తోంది. ప్రపంచాన్ని భిన్న కోణాల్లో చూడటం ఈమె నుంచి నేర్చుకోవచ్చు" అని అన్నారు మోనిక.