ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానవాళి మనుగడలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళాలోకాన్ని ఈ సందర్భంగా యావత్ ప్రపంచం కీర్తిస్తోంది. ఈ నేపథ్యంలో తన సామర్థ్యం మేరకు అతివలకు కృతజ్ఞతలు తెలపాలని అనుకున్నాడు ఓ టీ స్టాల్ యజమాని. మహిళా దినోత్సవం సందర్భంగా ఉచితంగా టీ అందిస్తున్నాడు.
ముంబయికి చెందిన మనోజ్ ఠాకూర్ నగరంలోని ఓ ప్రాంతంలో టీ పాయింట్ నిర్వహిస్తున్నాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అతివల కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. ఈ మేరకు తన టీ స్టాల్ వద్ద మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ బ్యానర్ ఏర్పాటు చేశాడు. ఉచితంగా టీ అందిస్తున్నాడు.