తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైన్యంలో మహిళల చేరికను ప్రోత్సహిస్తూ సైకిల్​​ ర్యాలీ - WOMANS DAY SPECIAL CRPF RALLY

ఇప్పటి వరకు జాతీయ భద్రత దృష్ట్యా బైక్​ రైడింగ్​ చేసిన సీఆర్​పీఎఫ్​ మహిళలను చూసి ఉంటాం. ఇప్పుడు ఈ వీర వనితలు ఓ ప్రత్యేక కారణంతో సైకిల్​​ ర్యాలీ చేపట్టారు. మహిళలు భారత సైన్యంలో చేరేలా ప్రోత్సహిస్తున్నారు.

Women take out cycle rally to mobilize for recruitment in CRPF
సైన్యంలో మహిళల చేరికను ప్రోత్సహిస్తూ సైకిల్​​ ర్యాలీ

By

Published : Mar 13, 2020, 2:01 PM IST

మహిళా జవాన్లు సైకిల్​ ర్యాలీ

దేశంలోని ప్రతి రంగంలో పురుషులతో సమానంగా మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే సైన్యంలో చేరేందుకు అంతగా ఉత్సుకత చూపించడం లేదు. ఈ నేపథ్యంలోనే భారత సైన్యంలో మహిళలు చేరే విధంగా ప్రోత్సహించేందుకు మహిళా సీఆర్​పీఎఫ్​ జవాన్లు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

సుమారు 50 మంది మహిళా జవాన్లతో మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా.. గుజరాత్​లోని కెవాడియా కాలనీ నుంచి ముంబయి వరకు సైకిల్​ ర్యాలీని ప్రారంభించారు. మహిళలు త్రివిధ దళాల్లో చేరాలని ప్రోత్సహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details