నదిలో మునిగిపోయిన ఇద్దరు పురుషులను చీరల సాయంతో కాపాడి.. అందరి ప్రశంసలు పొందుతున్నారు తమిళనాడుకు చెందిన ముగ్గురు మహిళలు.
ఇదీ జరిగింది?
పెరంబలూర్ జిల్లా సిరువాచుర్ ప్రాంతానికి చెందిన రంజిత్ అనే ఓ శిక్షణా వైద్యుడు తన స్నేహితుడితో కలిసి కొట్టరై మరూతాయార్ నదికి వెళ్లాడు. ఒడ్డున నిల్చొని నది అందాలను వీక్షిస్తుండగా.. కాలుజారి నీటిలోకి పడిపోయారు. ఇద్దరికీ ఈత రాకపోవడం వల్ల ప్రాణాలు కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.