తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తలాక్​ కేసు పెట్టారని.. మహిళ ముక్కు కోసేశారు!

ముస్లిం మహిళలకు రక్షణ కల్పించేందుకు ఇటీవలే కేంద్రం ముమ్మారు తలాక్​ బిల్లును తీసుకొచ్చింది. కానీ మహిళలకు తలాక్​ బాధలు ఆగడం లేదు. తలాక్​ కేసు పెట్టిందని కోడలి ముక్కు కోసేశారు ఓ అత్తింటివారు. ఈ అమానుష ఘటన ఉత్తర్​ప్రదేశ్​ సీతాపుర్​లో జరిగింది.

By

Published : Aug 8, 2019, 10:14 AM IST

తలాక్​ కేసు పెట్టారని.. మహిళ ముక్కు కోసేశారు!

ముమ్మారు తలాక్​ కేసును ఉపసంహరించుకునేందుకు నిరాకరించిందనే కోపంతో కోడలి ముక్కుకోసేశారు అత్తింటివారు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ సీతాపుర్​లో జరిగింది.

తన కూతురిపై అత్తింటివారు.. విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు బాధితురాలి తల్లిదండ్రులు. ముమ్మారు తలాక్​ కేసును వెనక్కి తీసుకోవడానికి నిరాకరించిందని దాడి చేసి ముక్కు కోసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించినందుకు తమపైనా రాళ్ల దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు.

కౌన్సిలింగ్​ ఇచ్చినా..

తలాక్​ ఫిర్యాదుపై మొదటగా ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్​ ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకే కేసు నమోదు చేసినట్లు చెప్పారు పోలీసులు.

" ఫోన్​ ద్వారా ముమ్మారు తలాక్​ చెప్పినట్లు మాకు ఫిర్యాదు వచ్చింది. ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్​ ఇచ్చాం. కానీ సమస్య పరిష్కారం కాలేదు. ముమ్మారు తలాక్​ చట్టం కింద కేసు నమోదు చేశాం. కేసు పెట్టిన మహిళపై దాడి జరిగింది. ఆమె ముక్కుపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు."

- పోలీసు అధికారి

ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టం-2019ని ఇటీవలే మోదీ సర్కారు తీసుకొచ్చింది. ఈ చట్ట ప్రకారం ఏకకాలంలో ముమ్మారు తలాక్ చెబితే భర్తకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: దేశంలో ఉగ్ర దాడులకు కుట్ర..! హై అలర్ట్​

ABOUT THE AUTHOR

...view details