మార్కెట్లో నాటుసారా విక్రయానికి అడ్డు చెప్పిన పోలీసులపై ఇద్దరు మహిళలు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. మహిళా కానిస్టేబుల్‌ను కర్రలతో చితక బాదారు. మహిళా కానిస్టేబుల్ సైతం ప్రతిఘటించడం వల్ల మార్కెట్లో ఉద్రిక్తత తలెత్తింది. ఒడిశా మయూర్భంజ్లోని బిసోయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
సారా విక్రేతలు, మహిళా కానిస్టేబుల్ మధ్య బాహాబాహీ - women police beaten by alchol seller in weekly market video viral
సారా విక్రయించొద్దని చెప్పిన లేడీ కానిస్టేబుల్‌పై ఇద్దరు మహిళలు దాడికి పాల్పడ్డారు. పొడవాటి కర్రలతో తీవ్రంగా చితకబాదారు. కానిస్టేబుల్ సైతం మహిళలపై ప్రతిదాడికి దిగారు.
సారా విక్రేతలు, మహిళా కానిస్టేబుల్ మధ్య బాహాబాహీ
తొలుత మహిళలను అడ్డుకొనేందుకు కానిస్టేబుల్ ప్రయత్నించినా.. వినిపించుకోకుండా దాడి చేశారు. సంబంధిత వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఘటనకు సంబంధించి ఓ మహిళను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి-రేపిస్టుకు కాంగ్రెస్ టికెట్- ప్రశ్నించారని మహిళపై దాడి