తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరుగుదొడ్లు లేక.. మధ్యాహ్న భోజనానికి దూరంగా! - మహిళలు మరుగుదొట్ల సదుపాయం

ఉత్తర్​ప్రదేశ్​ హర్దోయీలోని నయా గ్రామంలో మరుగుదొడ్ల సదుపాయం లేదు. ఫలితంగా 500 మందికిపైగా మహిళలు నాలుగేళ్లుగా మధ్యాహ్న భోజనం చేయడం మానేశారు. మధ్యాహ్నం తినకపోతే మలవిసర్జన చేయాల్సిన అవసరం ఉండదని వారి నమ్మకం. తమకు మరుగుదొడ్ల సదుపాయం అందివ్వాలని ఎంతో కాలంగా వీరు డిమాండ్​ చేస్తున్నారు.

Women miss lunch to avoid going to toilet in day time
మరుగుదొడ్లు లేక.. మధ్యాహ్న భోజనానికి దూరంగా!

By

Published : Dec 7, 2020, 12:46 PM IST

మరుగుదొడ్లు లేక.. మధ్యాహ్న భోజనానికి దూరంగా!

అది ఉత్తర్​ప్రదేశ్​ హర్దోయీలోని నయా అనే గ్రామం. ఆ ఊళ్లో 500 మందికిపైగా మహిళలు గత నాలుగేళ్లుగా మధ్యాహ్నం పూట భోజనం చేయడం మానేశారు. ఇదేమీ దీక్ష కాదు. తినడానికి అన్నం లేక కూడా కాదు. గ్రామంలో మరుగుదొడ్డి సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం.

మధ్యాహ్నం తినకపోతే..

భారత్​ను బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా తీర్చిదిద్దాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. కానీ హర్దోయీ జిల్లాలో మాత్రం పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. నయాతో పాటు పరిసర గ్రామాలనూ అధికారులు పట్టించుకోవడం లేదు.

ఫలితంగా గ్రామాల్లో మరుగుదొడ్ల సదుపాయం కల్పించడంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా.. తాము మధ్యాహ్న భోజనాన్ని మానేస్తామని 500కుపైగా మహిళలు ప్రతిజ్ఞ చేశారు. మధ్యాహ్నం తినకపోతే మలవిసర్జనకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నది వారి నమ్మకం.

"ఇక్కడ ఎవరికీ మరుగుదొడ్లు లేవు. మలవిసర్జనకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అందుకే మేము సరిగ్గా భోజనం కూడా చెయ్యం. నాలుగైదేళ్లుగా ఇదే పరిస్థితి. అయినా ఏమీ మారలేదు. ఖాళీ ప్రాంతంలోనే మలవిసర్జన చేయాల్సి వస్తోంది. అందుకే తినడం మానేశాం."

--- గ్రామస్థురాలు.

ఈ మహిళల్లో వికలాంగులు, వృద్ధులు కూడా ఉన్నారు. తమను ఆదుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలోని మహిళలు.

"మాకు ఇల్లు లేదు.. మరుగుదొడ్లు లేవు. ఇక్కడికి ఎవరూ రారు. మా పరిస్థితిని చూడరు. నేతలు వినరు, ఇంట్లోవారు వినరు, ఎవరూ వినరు. ఒకే పూట తింటాం. ఏం చేయాలి మరి? రోజులో ఎప్పుడైనా మలవిసర్జన చేయాల్సి వస్తే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఇక్కడి మహిళలు ఒకటేసారి తింటారు. అందరిదీ ఇదే పరిస్థితి. అందరూ ఇబ్బందులు పడుతున్నారు."

--- గ్రామస్థురాలు.

అయితే.. అనేక గ్రామాల్లో ఇప్పటికే మరుగుదొడ్లను నిర్మించినట్టు అధికారులు వెల్లడించారు. అవసరమైతే మరిన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం నిధులు సమకూరుస్తున్నట్టు పేర్కొన్నారు.

మరోవైపు.. యంత్రాంగం కదిలేంతవరకు తాము ఇలాగే నిరసన తెలుపుతామని మహిళలు తేల్చిచెబుతున్నారు.

ఇదీ చూడండి:-హిమాలయాల్లో అరుదైన 'బ్లూ షీప్​' ఆనవాళ్లు

ABOUT THE AUTHOR

...view details