తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళలను వివస్త్రల్ని చేసి పోలీసుల అమానుషం! - women in police custody at assam dharrang

ముగ్గురు మహిళలను పోలీస్​ స్టేషన్​లో వివస్త్రలను చేసి కొట్టిన అమానుష ఘటన అసోంలోని దర్రాంగ్​ జిల్లా సిపాఝూర్​ పోలీసు స్టేషన్​లో జరిగింది. పోలీసుల్లో ఓ మహిళా కానిస్టేబుల్​ కూడా ఉండటం బాధకలిగించే విషయం. కనీస మానవత్వం లేకుండా వ్యవహరించిన పోలీసు అధికారిని, మహిళా కానిస్టేబుల్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

మహిళలను వివస్త్రలను చేసి పోలీసుల అమానవీయంగా చర్య!

By

Published : Sep 19, 2019, 11:15 AM IST

Updated : Oct 1, 2019, 4:22 AM IST

మహిళలని చూడకుండా ఇష్టారీతిలో వ్యవహరించారు అసోం పోలీసులు. ముగ్గురు అక్కాచెల్లెళ్లను స్టేషన్‌కు పిలిపించి మరీ వివస్త్రల్ని చేసి విపరీతంగా కొట్టారు. ఆ ముగ్గురిలో ఒకరు గర్భిణి అనే విషయాన్ని కూడా పట్టించుకోని పోలీసుల దురహంకారంతో ఆమెకు గర్భస్రావమయింది. కఠినాత్ములను సైతం కదిలించే ఈ ఘటన అసోం దర్రాంగ్‌ జిల్లాలోని సిపాఝార్‌ పోలీసు స్టేషన్‌లో జరిగింది.

ఈ దారుణానికి ఒడిగట్టిన పోలీసుల్లో ఓ మహిళా కానిస్టేబుల్‌ ఉండటం మరింత బాధకలిగించే విషయం. కనీస మానవత్వం లేకుండా వ్యవహరించిన పోలీసు అధికారిని, మహిళా కానిస్టేబుల్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

అన్న ప్రేమ వ్యవహారమే..

ముగ్గురు అక్కాచెల్లెళ్లను, వారిలో వివాహిత అయిన యువతి భర్తను పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి కొట్టడానికి మరో కుటుంబం వీరిపై చేసిన ఫిర్యాదే కారణం. బాధిత మహిళల సోదరుడు తాను ప్రేమించిన స్థానిక యువతితో కలిసి ఇటీవల ఎక్కడికో వెళ్లిపోయాడు. వారిద్దరివీ వేర్వేరు మతాలు కావటం వల్ల విషయం పెద్ద వివాదమైంది.

అమానవీయంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు చేపట్టాలని జాతీయ మహిళా సంఘం(ఎన్‌సీడబ్ల్యూ) డిమాండ్‌ చేసింది.

ఇదీ చూడండి:కర్ణాటక:పండ్లు, పూలపై చిత్ర కళాప్రదర్శన అదుర్స్​..!

Last Updated : Oct 1, 2019, 4:22 AM IST

ABOUT THE AUTHOR

...view details