లక్షల మంది ప్రాణాలను బలిగొంటున్న కరోనాను ప్రపంచమంతా మహమ్మారిగా అభివర్ణిస్తోంది. ఛత్తీస్‌గఢ్ భిలాయ్‌లోని మహిళలు మాత్రం కరోనాను దేవతగా ఆరాధిస్తున్నారు. స్థానిక మహిళలు కొందరు బైకుంఠ డ్యామ్ సమీపంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింధూరం, పూలు, లడ్డూలు సమర్పించారు.
9 అంకెను పవిత్రంగా భావించి పూజలో 9 స్వీట్లు, 9 పువ్వులు, 9 వక్కలు, 9 లవంగాలు వినియోగించారు మహిళలు. పూజ పూర్తయ్యాక వీటన్నింటినీ గుంత తీసి పూడ్చారు. అయితే పూజ చేసే సమయంలో భౌతిక దూరం పాటించాలనే విషయాన్ని మాత్రం మర్చిపోయారు.