తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దులో రక్షాబంధన్​- జవాన్లకు రాఖీలు - Kashmir .Jawan Rakshabandhan

దేశ సేవకు అంకితమైన జవాన్లకు ఈశాన్య ప్రాంతాల మహిళలు కొందరు రాఖీలు కట్టారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రి జితేంద్రసింగ్​ పాల్గొన్నారు.

Women from northeast tie rakhi on jawans posted in J&K
జవాన్లకు రాఖీ కట్టిన ఈశాన్య ప్రాంత మహిళలు

By

Published : Aug 2, 2020, 10:30 PM IST

Updated : Aug 2, 2020, 10:59 PM IST

ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొందరు మహిళలు, భారత​ జవాన్లకు రాఖీలు కట్టారు. సోమవారం రక్షాబంధన్​ సందర్భంగా ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ మంత్రి జితేంద్రసింగ్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కశ్మీర్​, లద్దాఖ్​లో మోహరించిన సాయుధ, పారామిలటరీ బలగాల జవాన్లతో రక్షాబంధన్​ వేడుకలను జరుపుకొన్నారు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక బృంద మహిళలు.

మంత్రి జితేంద్రసింగ్​కు రాఖీ కడుతున్న మహిళ
జవాన్లకు రాఖీ కట్టిన ఈశాన్య ప్రాంత మహిళలు
జవాన్లకు రాఖీ కట్టిన ఈశాన్య ప్రాంత మహిళలు

కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి జితేంద్రసింగ్​ పాల్గొన్నారు. ఈశాన్య ప్రాంతాల స్వయం సహాయక సంఘాల మహిళల ప్రతిభ, నిబద్ధతలను ప్రశంసించారు మంత్రి.

జవాన్లకు రాఖీ కట్టిన ఈశాన్య ప్రాంత మహిళలు
జవాన్లకు రాఖీ కట్టిన ఈశాన్య ప్రాంత మహిళలు

ఇదీ చదవండి:అన్నయ్య చేతికి మాస్క్, శానిటైజర్ల రాఖీ కట్టేయండి!

Last Updated : Aug 2, 2020, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details